శంకర తీర్ధం మరియు అపర కర్మ క్రతు భవనాన్ని ప్రారంభించిన కావలి ఎమ్మెల్యే

 శంకర తీర్ధం మరియు అపర కర్మ క్రతు భవనాన్ని ప్రారంభించిన కావలి ఎమ్మెల్యే

కావలి పట్టణంలోని పాత శివాలయం వద్ద నూతనంగా నిర్మించిన శివ శంకర తీర్ధం మరియు అపర కర్మ క్రతు భవనాన్ని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు శుక్రవారం ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అద్దె ఇళ్లలో ఉండే వ్యక్తులు చనిపోయినప్పుడు వారి మృతదేహాన్ని ఆ ఇంటి యజమాని ఆ ఇంటి వద్ద ఉంచడానికి లేకుండా చేసేవారని, వారికి సరైన ఒక వేదిక లేక పడుతున్న ఇబ్బందులు కూడా తాను గుర్తించి ఒక భవనాన్ని నిర్మిస్తానని ఎన్నికల ముందు హామీ కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు.

తాను తలచిన కార్యం శివుని ఆజ్ఞతో ఎంతో మంది దాతల సహకారంతో ఈరోజు ఒక పెద్ద భవనం ఏర్పడటం జరిగిందని తెలిపారు. మృతదేహాన్ని ఉంచుకోవడం, కర్మ క్రతువులు నిర్వహించుకోవడం వంటి ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయాయని అన్నారు. ఇంత మంచి కార్యక్రమానికి సహకరించిన దాతలందరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని, ఇలాంటి మంచి కార్యక్రమాలు మున్ముందు మరెన్నో నిర్వహించి కావలి ప్రజలకు మేలు చేకూర్చాలని, ఇలాంటి కార్యక్రమాలకు తగిన సహకారం అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు. దాతలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించారు..

google+

linkedin